రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం పొద్దుటూరు గ్రామ సర్పంచ్ నర్సింహారెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. తాను కీళ్ల నొప్పులతో బాధపడుతూ అపోలో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లానని చెప్పారు. బంధువుల్లో ఒకరికి కరోనా సోకడంతో భయపడి టెస్టు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. దీనితో అతను తన కుటుంబానికి దూరంగా హోమ్ క్వారంటైన్లో ఉన్నానని వెల్లడించారు.
ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్తే లక్షల్లో బిల్లులు వేస్తున్నారని, అప్పుడు తనకు ప్రగతి రిసార్ట్స్ డైరెక్టర్ రామకృష్ణ సూచనలతో ప్రగతి ఆయుర్వేద మందులు వాడానని తెలిపారు. భయపడకుండా ధైర్యంగా ఉన్నందున ఈరోజు కరోనా వైరస్ నుండి బయటపడ్డానని అన్నారు. కరోనా సోకినా ఎవ్వరూ భయపడకుండా ఆయుర్వేద మందులు, పండ్ల రసాలు, కషాయాలు తాగి తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల వైరస్ను నియంత్రించవచ్చని తెలిపారు.
ఇదీ చూడండి: 'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది'