ETV Bharat / state

పట్టణ ప్రగతిని ప్రణాళికతో ఉపయోగించుకోవాలి: మంత్రి సబితా - పట్టణ ప్రగతి కార్యక్రమంను ప్రారంభించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జల్​పల్లి మున్సిపాలిటీలోని 20వ వార్డు శ్రీరాంనగర్ కాలనీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టారు. పల్లెలు పట్టణాలన్నీ పరిశుభ్రతతో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

plan has to do with the urban progress jalpally areas Minister Sabitha indrareddy
పట్టణ ప్రగతిని ప్రణాళికతో ఉపయోగించుకోవాలి : మంత్రి సబితా
author img

By

Published : Feb 24, 2020, 7:55 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీలోని 20వ వార్డు శ్రీరాంనగర్ కాలనీలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమంను ప్రారంభించారు. పల్లెలు, పట్టణాలు, పచ్చదనం, పరిశుభ్రంగా ఉండాలని మంత్రి సూచించారు. ఈరోజు నుంచి ప్రారంభమై 10 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు.

గాంధీజీ కలలు కన్న రాజ్యం కావాలనే ఉద్దేశ్యంతోనే సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు. అధికారులను, నేతలను ప్రజల వద్దకు పంపించి వారి సమస్యలు తెలుసుకొని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జల్​పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ అబ్దుల్లా బిన్ అహ్మద్ సాది, వైస్ ఛైర్మన్ ఫర్హాన్ నాజ్, కమిషనర్ అహ్మద్ సఫీ ఉల్లాహ్, ప్రత్యేక అధికారిణి కల్యాణి, రెవెన్యూ సిబ్బంది, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

పట్టణ ప్రగతిని ప్రణాళికతో ఉపయోగించుకోవాలి : మంత్రి సబితా

ఇదీ చూడండి : ట్రంప్ దిష్టి బొమ్మ దగ్ధం.. 'గో బ్యాక్ ట్రంప్' నినాదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.