ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు

కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. పలు ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత దృష్ట్యా... ప్రజలే స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నారు. కొవిడ్‌ ప్రబలకుండా ఎక్కడికక్కడే రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. కరోనా నిబంధనలు పాటించి ప్రజలంతా కరోనా కట్టడికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు.

corona controlling
కరోనా కట్టడికి యంత్రాంగం పకడ్బందీ చర్యలు
author img

By

Published : Apr 26, 2021, 9:36 PM IST

కరోనా కట్టడికి యంత్రాంగం పకడ్బందీ చర్యలు

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతుండడం వల్ల అధికారులు చర్యలు చేపట్టారు. జంట నగరాల పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్​పేట, గంజ్‌ మార్కెట్‌ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారి చేశారు. మడ్‌ఫోర్డ్, చిన్నతోకట్ట, నక్కల బస్తీ ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతుండగా కట్టడి చర్యలపై స్థానిక నేతలు దృష్టిసారించారు. ఎమ్మెల్యే సాయన్న ఆదేశాలతో రసాయన ద్రావణాలు స్ప్రే చేశారు. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

ఔదార్యం చూపింది..

నిజామాబాద్‌లోని రద్దీ ప్రాంతాల్లో వైరస్‌ కట్టడికి హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని నగరపాలక సంస్థ పిచికారీ చేయిస్తోంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా విపత్తు వేళ వనస్థలిపురానికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్‌ యాజమాన్యం క్యాబ్‌ సేవలందించి.. ఔదార్యం చూపింది. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ఎల్బీనగర్‌, వనస్థలిపురం, చౌటుప్పల్‌, ఇబ్రహింపట్నం వాసులు.. రాత్రికర్ఫ్యూ దృష్ట్యా ఆ క్యాబ్‌ సేవలను ఉపయోగించుకోవాలని రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సూచించారు.

ఊర్లోకి రాకుండా కంచె..

మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో కరోనా నియంత్రణకు స్థానికులు పక్కా చర్యలు చేపట్టారు. మహారాష్ట్రలో కొవిడ్ ఉద్ధృతితో భీంపూర్ మండలం అంతర్గావ్ వాసులు తమ ఊరిలోకి మహారాష్ట్ర నుంచి రాకపోకల కట్టడికి పెన్​గంగా నది నుంచి వచ్చే దారులను కంచె వేసి మూసేశారు. బిహార్ నుంచి కూలీలు రైలు మార్గం ద్వారా మహారాష్ట్ర, నాగపూర్ మీదుగా ఆదిలాబాద్‌కు వందలాదిగా చేరుకుంటున్నారు. అక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా హైదరాబాద్‌, వరంగల్‌, నిర్మల్‌, కరీంనగర్‌ జిల్లాలకు పయనమవుతున్నారు. ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై ఎటు చూసినా బిహారీ కార్మికులే దర్శనమిస్తున్నారు. బస్సుల్లో కరోనా నిబంధనలు పాటించకుండా కిక్కిరిసి ప్రయాణం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

భార్యాభర్తలు మృతి..

జగిత్యాల జిల్లా చల్‌గల్ గ్రామంలో మహమ్మారి బారిన పడి మూడు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు మృతిచెందారు. గ్రామానికి చెందిన భీమలింగం, అతడి భార్య లక్ష్మి.. కొన్ని రోజుల క్రితం వైరస్ బారిన పడ్డారు. మూడు రోజుల క్రితం భీమలింగం మరణించగా... చికిత్స పొందుతూ అతడి భార్య మరణించింది.

భర్త భుజాలపై భార్య మృతదేహం..

కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి ఐసోలేషన్ వార్డులో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆక్సిజన్‌ అందక కరోనా బాధితుడు మరణించాడని బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని అంతిమ సంస్కారాలకు తరలించకుండా జాప్యం చేశారని విమర్శించారు. భిక్షాటన చేసి కాలం వెల్లదీసే ఓ మహిళ ప్రాణాలు కోల్పోతే పరిస్థితి ఎలా ఉంటుందనే ఘటన కామారెడ్డి పట్టణంలో అందరినీ కలచివేసింది. రైల్వేస్టేషన్‌లో నాగలక్ష్మి అనే యాచకురాలు ప్రాణాలు కోల్పోయింది. ఆమె కరోనాతోనే మృతిచెంది ఉంటుందని భావించిన స్థానికులు.. మృతదేహం వద్దకు ఎవరూ వెళ్లలేదు. చివరకు మృతురాలి భర్త స్వామికి.. రైల్వే పోలీసులు 2500 రూపాయలు అంత్యక్రియల కోసం సాయం చేశారు. అనంతరం తన భార్యను భుజాలపై మోసుకొని అంత్యక్రియలకు తీసుకువెళ్లారు.

ఆక్సిజన్​ నిల్వలపై ఆరా..

నాగర్​కర్నూలు జిల్లా ప్రాంతీయ ఆస్పత్రిని కలెక్టర్ శర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా పరీక్షల విభాగం, వార్డులు, ఐసోలేషన్ సెంటర్లను పరిశీలించారు. ఆక్సిజన్ సిలిండర్ నిల్వలపై ఆరా తీశారు. కొవిడ్‌ బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రిలో కరోనా పరీక్షల కోసం వచ్చే వారు నిలువ నీడ లేక ఎండలోనే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పాడింది. షామియానా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి: అడవిని వీడి హోటల్​కు వచ్చిన చిరుతలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.