ETV Bharat / state

Revanth Reddy: 'వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ఇక్కడి నుంచే వచ్చారు' - పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజా వార్తలు

పార్టీ కోసం కష్టపడే వాళ్లకే టికెట్లిస్తామని టీపీసీసీ చీఫ్​ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పని చేసే వారికి బీ ఫామ్​లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. రాజకీయాలు చేస్తా అంటే టికెట్లు రావని, సైనికుడిగా కొట్లాడితే టికెట్లు వాటంతట అవే వస్తాయని వివరించారు. శంషాబాద్‌లో నిర్వహించిన యువజన కాంగ్రెస్ సమావేశంలో రేవంత్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్‌ తదితరులు హాజరయ్యారు.

Revanth Reddy:
రేవంత్ రెడ్డి
author img

By

Published : Aug 21, 2021, 6:25 PM IST

రాబోవు 20 నెలలు కష్టపడితే టికెట్ల ఇస్తామని లేదంటే ఇచ్చేది లేదని యువజన కాంగ్రెస్ నాయకులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కష్టపడి పని చేసే వారికి బీ ఫామ్​లు ఇంటికి తీసుకొచ్చి ఇస్తామన్నారు. రాజకీయాలు చేస్తా అంటే టికెట్లు రావని, సైనికుడిగా కొట్లాడితే టికెట్లు వాటంతట అవే వస్తాయని వివరించారు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ లాంటి నాయకులు కూడా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారని తెలిపారు. శంషాబాద్‌లో జరిగిన యువజన కాంగ్రెస్ సమావేశంలో ముఖ్య అతిథిలుగా పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్​ దిశానిర్దేశం చేశారు.

యూత్ కాంగ్రెస్ వాళ్లకు టికెట్ల ఇచ్చే ముందు... ప్రజల కోసం పోరాటం చేస్తున్నారో లేదో చూస్తామని రేవంత్ రెడ్డ అన్నారు. నిర్ణయాలు పీసీసీ చేసినా.. ఓట్లు వేయించే బాధ్యత యూత్ కాంగ్రెస్​దేనని స్పష్టం చేశారు. సంక్షోభం ఉన్నప్పుడే నాయకులు పుట్టుకొస్తారన్న రేవంత్... కాంగ్రెస్ ఇప్పుడు అదే పరిస్థితిలో ఉందన్నారు. రేవంత్ పార్టీ మారలేదా అని కొందరు అంటున్నారని... రేవంత్ రెడ్డి పార్టీ మారినా ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినానని.. అధికార పార్టీలోకి… అధికారం కోసం పోలేదని స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి కాలు చిప్ప పగల గొట్టుకుంటే... రాహుల్ గాంధీ పక్కన వచ్చి కూర్చురన్నారు. కాంగ్రెస్​కి ఎవరు ఓనర్లు లేరని... ఎవరు కష్టపడితే వాళ్లే ఓనర్లను చెప్పారు.

'గులాం నబీ ఆజాద్​, అంబిక సోనీ, శరద్​ పవార్​, మమత బెనర్జీ, రమేశ్​ చనీత, ముఖుల్​ వాస్నిక్​ యూత్​ కాంగ్రెస్​ నుంచి వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి, చంద్రబాబు, సీఎం కేసీఆర్​ కూడా యూత్​ కాంగ్రెస్​ నుంచే వచ్చారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వాళ్లకే టికెట్​ ఇస్తాం.' -రేవంత్​ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

రాష్ట్రంలో 72 సీట్లు గెలవాలన్నది కాంగ్రెస్ టార్గెట్ అని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అందరూ కష్టపడి పని చేయాలని, క్రమశిక్షణతో పని చేస్తే అవకాశాలు వస్తాయన్నారు. అందరూ కలిసి కట్టుగా పని చేస్తే కాంగ్రెస్​ను వచ్చే 20 నెలల్లో అధికారంలోకి తీసుకొద్దామని పిలుపునిచ్చారు.

Revanth Reddy: మహామహులందరూ యుత్​ కాంగ్రెస్​ నుంచే వచ్చారు

ఇదీ చదవండి: Kishan Reddy: దేశానికి రాజైనా అంబర్​పేటకు బిడ్డనే: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.