ETV Bharat / state

ఆరేళ్ల క్రితం తప్పిపోయాడు..టిక్​టాక్​తో దొరికాడు.. - padma

ఒక్కగానొక్క కుమారుడు మాటలు రావు.. ఏడేళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తనయుడికి కోసం వెతికి అలిసిపోయిన తల్లిదండ్రులు.. ఆశలు వదులుకున్నారు. కుమారుడి జ్ఞాపకాలను తలచుకుంటూ జీవిస్తున్న వారికి టిక్​టాక్ ప్రాణం పోసింది. అదేంటో ఈ కథనం చదవండి.

tick tailk
ఆరేళ్ల క్రితం తప్పిపోయాడు..టిక్​టాక్​తో దొరికాడు..
author img

By

Published : Feb 23, 2020, 2:26 PM IST

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లికి చెందిన దుర్గాపురం పద్మ, పెంటయ్య కుమారుడు కాశిం(13) పుట్టుకతో మూగ. అతను ఆరేళ్ల క్రితం వెళ్లిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చెల్లూరులో తిరుగుతున్న కాశీంను స్థానిక యువకులు సెల్ ఫోన్​లో చిత్రీకరించి ' టిక్ టాక్ 'లో పోస్ట్ చేశారు.

ఆరేళ్ల క్రితం తప్పిపోయాడు..టిక్​టాక్​తో దొరికాడు..

తలకొండపల్లికి చెందిన యువకులు ఆ వీడియోను చూసి ఈ నెల 11న తల్లిదండ్రులకు చెప్పారు. కుమారుడి కోసం ఆతృతగా చల్లూరు వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది. కాశీం మళ్లీ ఏటోవెళ్లిపోయాడని రాజపేట పోలీసులు సమాధానం ఇవ్వడం వల్ల పద్మమ్మ, పెంటయ్యకు నిరాశే మిగిలింది.

కొద్ది రోజుల తలకొండపల్లికి చెందిన అక్కచెల్లెళ్లు వీణ, వాణి శనివారం సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి వచ్చారు. అదే సమయంలో వారికి రోడ్డుపై కాశీ కనిపించాడు. అప్పటికే అతడి చిత్రాలను టిక్ టాక్​లో చూసి ఉండటంతో గుర్తించి చేరదీశారు. వెంటనే అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కుమారుడిని తమ గ్రామానికి తీసుకెళ్లారు.

ఇవీ చూడండి: కొత్త జీహెచ్​ఎంసీ చట్టంపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.