Conflict at Swimming Pool: రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ స్టేడియంలో స్విమ్మింగ్ కోచ్ సంజయ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. స్విమ్ చేసే సమయంలో సరైన చర్యలు తీసుకోవడం లేదని, పిల్లల తల్లిదండ్రులతో గొడవకు దిగుతున్నారని ఆరోపించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్నారులు స్విమ్ చేసే సమయంలో కోచ్ గానీ అసిస్టెంట్లు గానీ ఎవరూ లేకుండా స్విమ్మింగ్ చేయిస్తున్నారని.. అదేంటని అడిగితే అసభ్య పదజాలంతో కోచ్ దూషిస్తున్నారని మండిపడ్డారు. సంజయ్‌పై స్టేడియంలోని ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి వెంకటేశ్వర్ రావు... స్విమ్మింగ్ పూల్‌లో అన్ని రక్షణ జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. సురక్షితమైన కోచ్‌లు, సీసీటీవీల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నామన్నారు. కోచ్‌కి భాషా పరమైన ఇబ్బంది ఉందని.. అందుకే చిన్న చిన్న పొరపాట్లు తలెత్తాయని వివరణ ఇచ్చారు. అధికారి జోక్యంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి: KA Paul Allegations On Cm Kcr: 'నాకేమైనా అయితే కేసీఆర్, కేటీఆర్‌దే బాధ్యత'