రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని కాచారం గ్రామంలో రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో డీపీఓ పద్మజారాణి పాల్గొన్నారు. తడిచెత్త, పొడిచెత్తపై ప్రతి గ్రామానికి అవగాహన కల్పించాలని సెక్రటరీలకు చెప్పారు.
క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామాల్లో చేపట్టాలని.. ఎవరైతే రోడ్డుపై చెత్త వేస్తారో వారికి రూ. 500 జరిమానా విధించాలని సెక్రటరీలను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలోనే కాచారం గ్రామం పరిశుభ్రతలో ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె తెలిపారు.
రెండో దఫా పల్లె ప్రగతిలో నిరక్షరాస్యులైన 18 ఏళ్ల వయసు దాటిన వారందరికి చదువు చెప్పి వారిని ప్రయోజకులను చేయాలని పంచాయతీ సెక్రెటరీలకు సూటించారు.
ఇవీ చూడండి: పొలంలో కరెంట్ షాక్తో రైతు మృతి