ETV Bharat / state

రాష్ట్రంలో గాలివాన బీభత్సం.. అన్నదాతకు తీరని నష్టం

Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టం తెచ్చిపెట్టింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దవడంతో.. రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నల్గొండ, సిద్దిపేట జిల్లాల్లో పిడుగుపడి ఇద్దరు మృతి చెందారు.

Heavy Rains in Telangana
తెలంగాణలో భారీ వర్షం
author img

By

Published : May 4, 2022, 11:07 AM IST

Updated : May 4, 2022, 12:08 PM IST

Heavy Rains in Telangana: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉప్పెనలా విరుచుకుపడిన వాన.. అన్నదాతలను ఆగమాగం చేసింది. పలు జిల్లాల్లో కోత దశలో ఉన్న వరి చేలు.. గాలివానకు నేలకొరిగి నీటమునిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. ఆరుగాలం శ్రమించిన రైతుల కష్టం.. వానపాలైంది. అకాల వర్షం కారణంగా హైదరాబాద్​ మహానగరం అతలాకుతలమైంది. రహదారులు జలమయ్యాయి. పలు చోట్ల ట్రాఫిక్​ స్తంభించింది. ఈదురుగాలులకు భారీ చెట్లు సైతం నేలకొరిగాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

మోకాళ్ల లోతు వరద: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో కురిసిన భారీవర్షంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా చేరిన వరదనీటితో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసు కమిషనర్ కార్యాలయ సమీపంలోని హైదర్ గూడ రహదారిపై భారీగా నీరు చేరడంతో... కార్లు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదర్‌గూడ నుంచి బషీర్‌బాగ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. బషీర్ బాగ్​లో రహదారిపై చెట్ల కొమ్మలు విరిగిపడటంతో పాటు.. లా కళాశాల ఎదుట రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరడంతో బాటసారులు ఇబ్బందులు పడ్డారు. సూరారం ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.

Heavy Rains in Telangana
భారీ వర్షానికి నేలకొరిగిన చెట్టు.. దెబ్బతిన్న కారు

జలమయం: సాగర్ రింగ్ రోడ్ కాకతీయ కాలనీలో ఓ స్కూటీ వరదకు కొట్టుకొచ్చింది. మీర్‌పేటలో లెనిన్ నగర్ నీట మునగగా.. ఇళ్లలోకి వర్షపు నీరు రావడంతో స్థానికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఆల్వాల్‌లో కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. పాతబస్తీలో చార్మినార్, హుస్సేని అలం, షా అలీ బండ ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాల దృష్ట్యా చార్మినార్‌ జోనల్‌ కమిషనర్‌తో ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడారు. వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగినట్లు తెలిపారు. నీటమునిగిన ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని కమిషనర్​ను కోరారు.

Heavy Rains in Telangana
కాలనీల్లోకి భారీగా వరద చేరడంతో బోటు సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న స్థానికులు

యాదాద్రిపై ఆగమాగం: ఏకధాటి వానకు యాదగిరిగుట్టలో కొండపై క్యూ కాంప్లెక్స్‌లోకి వర్షపు నీరు చేరింది. దిగువ ఘాట్‌రోడ్డు ప్రారంభంలో తారు రోడ్డు కుంగిపోయింది. దీంతో దిగువ ఘాట్​రోడ్డులో రాకపోకలు నిలిపివేశారు. వర్షం ధాటికి చలువ పందిళ్లు ఊడిపడ్డాయి. కొండపైకి చేరుకునే మొదటి ఘాట్ రోడ్డుపై మట్టిపెళ్లలు కూలిపోయాయి. వర్షానికి కొండ దిగువన కాలనీలోకి మట్టిపెల్లలు జారిపడ్డాయి. సిబ్బంది సహాయంతో వాటిని తొలగించారు. కొండపైకి వెళ్లే ఘాట్‌రోడ్డు మీదుగా రాకపోకలకు అనుమతించారు. వర్షపు నీటితో యాదగిరిగుట్ట బస్టాండ్‌ ప్రాంగణం నిండిపోయింది. మోత్కూరు మం. దాచారంలో పిడుగుపడి 15 గొర్రెలు మృతి చెందాయి. ఆత్మకూరు మండలం కూరెళ్లలో పిడుగుపడి గేదె మృతి చెందింది. అడ్డగూడూరు మండలం మంగమ్మగూడెంలో పిడుగుపడి తాటిచెట్టు దగ్ధమైంది.

Heavy Rains in Telangana
యాదాద్రిపై కూలిన చలువ పందిళ్లు

మింగిన పిడుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాక, సిద్దిపేట, పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్సింది. దుబ్బాక నియోజకవర్గంలోని నరేండ్లగడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పపై టార్పాలిన్​ కప్పుతుండగా పిడుగుపడి రైతు పోచయ్య(65) మృతి చెందారు. మరో రైతు కొండయ్య విద్యుదాఘాతానికి గురవ్వడంతో దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఎడతెరిపి లేని వర్షం: మరోవైపు నల్గొండ జిల్లావ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మోస్తరు వర్షం కురవగా.. త్రిపురారం, నిడమనూరు, అనుముల, మిర్యాలగూడ, పెద్దవూర, చిట్యాల, భువనగిరి, మోత్కూరులో ఎడతెరిపిలేని వాన కురిసింది. నకిరేకల్‌ మండలం మోదినిగూడెంలో పిడుగుపడి.. లింగస్వామి(23) మృతి చెందారు. హాలియా మార్కెట్ యార్డులో ధాన్యం తడిసిపోగా.. నిడమనూరు మం. వేంపాడు కొనుగోలు కేంద్రంలో 2 వేల బస్తాల ధాన్యం తడిసిముద్దైంది.

Heavy Rains in Telangana
వరుణుడి బీభత్సం

కొట్టుకుపోయిన ధాన్యం: భారీ వర్షానికి పెద్దపల్లి జిల్లాలో మార్కెట్‌ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మంథని మార్కెట్ యార్డు, పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా.. ధాన్యం కుప్పల చుట్టూ చేరిన వర్షపు నీటిని రైతులు తొలగిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి నెల రోజులు దాటినా ఇంతవరకూ కాంటా పెట్టలేదని రైతులు వాపోతున్నారు. సుల్తానాబాద్‌ మార్కెట్‌ యార్డులో 20 వేల క్వింటాళ్ల ధాన్యం నీటిపాలైంది. టార్పాలిన్లు అందుబాటులో లేకపోవడంతో.. పెద్దపల్లి మార్కెట్​లో 500 క్వింటాళ్ల ధాన్యం కొట్టుకుపోయింది.

తీరని నష్టం: వరంగల్ జిల్లాలో అకాల వర్షం అన్నదాతలను ఆగం చేసింది. చేతికందొచ్చిన పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదని.. సకాలంలో కొనుగోళ్లు జరపడం లేదని వాపోయారు. వర్ధన్నపేట సహా రాయపర్తి, సంగెం, పర్వతగిరి, ఐనవోలు మండలాల్లో కోత దశలో ఉన్న మామిడి కాయలు రాలిపోయాయి. వరి, మొక్కజొన్న రైతులు అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయారు. అటు నర్సంపేట వ్యాప్తంగా కురిసిన వర్షాలకు వరి, మామిడి, మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అన్నదాతల శోకం: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షంతో చేతికందిన ధాన్యం దిగుబడులు పూర్తిగా తడిచిపోయాయి. హుజూరాబాద్‌, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు తరలించిన ధాన్యం వర్షపు నీటితో కాలువల వెంట కొట్టుకుపోయింది. ఇల్లందకుంట, కమలాపూర్‌, వీణవంక మండలాల్లో రోడ్డు పక్కన పోసిన ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్ కవర్లను అందించటం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

నిండా ముంచిన అకాల వర్షం..: జగిత్యాల జిల్లాలో భారీ వర్షానికి పది మండలాల్లో ధాన్యం రాశులు వరద పాలయ్యాయి. మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించారు. వరద నీటిని జీవన్ రెడ్డి స్వయంగా తొలగించారు. భారీ ఈదురు గాలులకు మామిడికాయలు నేల రాలడంతో రైతులు నష్టపోయారు. ధర్మపురి,రాయపట్నంతో పాటు పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. తిమ్మాపూర్​లో ఓ ఇంటి గోడ కూలింది. పంట చేతికి వచ్చే సమయంలో వరి చేలు నేలకొరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. మల్యాల మండలం బల్వంతాపూర్‌లో పిడుగుపడి ఇద్దరికి గాయాలయ్యాయి. పిడుగుపాటుకు బల్వంతాపూర్‌లో 43 మేకలు మృతి చెందాయి.

చీకటి తప్పలేదు: రాత్రి కురిసిన గాలివాన బీభత్సానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో చెట్లు నేలకొరిగాయి. పార్కింగ్ చేసిన వాహనాలపై చెట్లు విరిగిపడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. కరెంటు తీగలపై చెట్లు విరిగిపడటంతో స్తంభాలు విరిగి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హాజీపూర్, దండేపల్లి, లక్శెట్టిపేట మండలాల్లో రైతులు కొనుగోలుకు సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం తడిసి ముద్దవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంటను అకాల వర్షం అతలాకుతలం చేసిందని రైతులు ఆవేదన విలపిస్తున్నారు.

అప్పటిదాకా మేల్కొని ఉన్నా: మెదక్‌ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసి ముద్దయింది. నర్సాపూర్ పట్టణ సమీపంలో గల మార్కెట్ కమిటీ లో రాత్రి వర్షం వచ్చే సూచన ఉందా అని రెండు గంటల వరకు మేల్కొని కవర్లు కప్పి నిద్ర పోయారు. మూడు గంటల ప్రాంతంలో వర్షం రావడంతో రైతులు ఏం చేయలేకపోయారు. కవర్లు కప్పినా వరదనీరు కింది నుంచి రావడంతో ధాన్యం తడిసి ముద్దయింది.

ఇవీ చదవండి: రాష్ట్రం నిద్రపోతున్న వేళ.. వరణుడు సృష్టించిన విలయం

సందడి సందడిగా 'చేపల పండగ'- ఈ ఏడాది జోరుగా వర్షాలు!

Rain in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Last Updated : May 4, 2022, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.