Occult worship at school: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లుగా ప్రధానోపాధ్యాయుడు వెల్లడించారు. పాఠశాల సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ఎదుట రెండు ప్రాంతాల్లో బొమ్మలు, పసుపు, కుంకుమ, గవ్వలు, మేకులు, నిమ్మకాయలు పెట్టినట్లుగా గుర్తించారు. పాఠశాలలోని సీసీ కెమెరాలు సైతం మాయమైనట్లుగా తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
"పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. పాఠశాల సైన్స్ ల్యాబ్, స్టోర్ రూమ్ ఎదుట రెండు ప్రదేశాలలో బొమ్మలు, పసుపు, కుంకుమ, గవ్వలు, మేకులు, నిమ్మకాయలు పెట్టారు. వాటిని చూసి విద్యార్థులు భయంతో వణికిపోయారు. మూఢనమ్మకాలు నమ్మొదని విద్యార్థులకు ధైర్యం చెప్పి వాటన్నింటిని కడిగించి తరగతులు యథావిథిగా నిర్వహించాను."- పాఠశాల ప్రధానోపాధ్యాయుడు
ఇవీ చదవండి: