Statue Of Equality: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో వెలసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో ఈనెల 29 నుంచి వచ్చే 1 వరకు సందర్శకులకు ప్రవేశం లేదని త్రిదండి చినజీయర్ స్వామి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రంలో మార్చి 29 నుంచి మండల అభిషేకాలు, ఆరాధనలు జరుగుతాయని అందువల్లే... సందర్శకులకు ఆలయ ప్రవేశం ఉండదని పేర్కొన్నారు. తిరిగి ఉగాది పర్వదినం సందర్భంగా సందర్శనం ప్రారంభమవుతాయని వివరించారు. రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుందన్నారు. ప్రతి బుధవారం సెలవు ఉంటుందని పేర్కొన్న ఆయన... ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
సెల్‌ఫోన్, కెమెరాలు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని సూచించారు. పాదరక్షలు బయటే వదలాలని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి ఆహార పానీయాలకు లోపలికి అనుమతి లేదని... ఈ నిబంధనలను భక్తులంతా పాటించాలని కోరారు.