ETV Bharat / state

Niranjan Reddy on Palamuru Rangareddy Project : పాలమూరుకు తీరనున్న కష్టాలు.. త్వరలోనే సాగునీళ్లు - తెలంగాణ న్యూస్

Niranjan Reddy on Palamuru Rangareddy Project: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నీళ్లు త్వరలోనే అందరికి అందుబాటులోకి రానున్నాయని మంత్రి నిరంజన్​రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు లభించాయని.. మిగతా పనులు పూర్తి చేసి త్వరలోనే రైతన్నలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Palamuru Ranga Reddy Lift Irrigation Project Works

author img

By

Published : Aug 11, 2023, 3:00 PM IST

Palamuru Ranga Reddy Lift Irrigation Project Works త్వరలో రైతన్నల సాగుకు పాలమూరు ప్రాజెక్టు నీళ్లు

Niranjan Reddy on Palamuru Rangareddy Project : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల కోరికలు తీర్చడానికి బీఆర్​ఎస్ నాయకులు సిద్ధమవుతున్నారు. ప్రాజెక్టులు, పథకాలు పూర్తి అమల్లోకి తీసుకోస్తున్నారు. పూర్తి కాని ప్రాజెక్టులు ఎన్నికల సమయంలోపై పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయాత్నాలు చేస్తున్నారు. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించిన నేపథ్యంలో జిల్లా రైతులకు మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) శుభాకాంక్షలు తెలిపారు.

Palamuru Rangareddy Project Environmental Clearance : పాలమూరు ప్రజల కాళ్లను కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ శపథం చేశారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు వచ్చిన నేపథ్యంలో.. ఆ కల త్వరలోనే నెరవేరబోతోందని తెలిపారు. ఇక పాలమూరు రైతుల కష్టాలు తీరినట్లేనన్న అన్నారు.

Palamuru Rangareddy Lift Irrigation Project : ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తై ప్రజలకు రెండేళ్ల క్రితమే ఫలితాలు అందాల్సిందని కానీ... ఓవైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్ధిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయని అన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ఇప్పటికే 85 శాతం పనులు పూర్తై త్వరలో నీళ్లివ్వడానికి సర్వం సిద్ధం చేసినట్లు నిరంజన్ రెడ్డి చెప్పారు.

Palamuru-Rangareddy Lift Irrigation Project Status : పరుగులు పెడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు

త్వరలో రైతన్నలకు సాగుకు నీరు : మిగిలిన పనులను వీలైనంత తొందరగా పూర్తి చేసి.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana Cm KCR) చేతుల మీదుగా నీళ్లు విడుదల చేస్తామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రజల వెతలు సంపూర్ణంగా తీరే శుభసమయం ఆసన్నమవుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇక పాలమూరు ప్రజల కష్టాలు తీరినట్లేనని మంత్రి వ్యాఖ్యానించారు. రైతులు, ప్రజలు వేయి నీళ్ల కోసం కళ్లతో ఆ సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇప్పటికే నార్లాపూర్, ఏదులలో పంపుల ఎరెక్షన్ పనులు పూర్తయ్యాయని.. మిగిలిన పనులు ఈ అనుమతుల కోసం ఆగాయని అన్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తీసుకెళ్లడం అనితర సాధ్యమైన పని అన్న నిరంజన్ రెడ్డి... అది ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమైందని తెలిపారు.

పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్వీట్(KTR Tweet Today) చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదలతో చేసిన కృషి ఎట్టకేలకు ఫలితం దక్కిందని అన్నారు. చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ఇక యుద్ధప్రాతిపదికన పూర్తవుతుందని మంత్రి కేటిఆర్‌ ట్వీట్​లో పేర్కొన్నారు.

Palamuru Rangareddy Lift Irrigation Project : 'పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు'

Kalwakurthy lift irrigation project : కానరాని నిర్వహణ.. రైతుల్లో ఆందోళన.. ప్రశ్నార్థకంగా 'కల్వకుర్తి ప్రాజెక్టు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.