ETV Bharat / state

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కొత్తగా 38 కరోనా కేసులు - కరోనా 2020

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో శనివారం 38 కరోనా కేసులు నమోదయ్యాయి. సాయిబాబానగర్‌కు చెందిన 63 ఏళ్ల వృద్ధుడు మహమ్మారితో పోరాడి మృతి చెందాడు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 345 మంది వైరస్‌ బారిన పడ్డారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో కొత్తగా 38 కరోనా కేసులు

author img

By

Published : Jul 4, 2020, 8:48 PM IST

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో శనివారం 38 కరోనా కేసులు నమోదయ్యాయి. సాయిబాబానగర్‌కు చెందిన 63 ఏళ్ల వృద్ధుడు మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

చింతల్ పరిధిలో 10 కేసులు నమోదవగా, జీడీమెట్ల పరిధిలో ఏడుగురు వైరస్‌ బారినపడ్డారు. జగద్గిరిగుట్ట, గాజుల రామారం, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, కొంపల్లి, సంజయ్ గాంధీ నగర్, ప్రగతి నగర్, షాపూర్ నగర్ ప్రాంతాలలో కేసులు నమోదయ్యాయి.

నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటివరకు 345 కేసులు నమోదవగా.. కొవిడ్‌ బారిన పడి చికిత్స పొందుతూ 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు విపరీతంగా పెరుగుతున్నందున స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే భౌతిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి: బుద్ధుని బోధనలు సర్వదా అనుసరణీయం: మోదీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.