ETV Bharat / state

సాయం చేసి... సొమ్ము దోచుకెళ్లాడు

ఏటీఎం మిషన్​లో డబ్బులు డిపాజిట్​ చేస్తున్నారా.. అయితే.. జాగ్రత్త. అక్కడ ఉన్న వారిని ఎవరిని కూడా నమ్మోద్దు. అందరూ అలా ఉంటారని కాదు.. కానీ కొంతమంది ఉంటారు. సాయం చేస్తామని చెప్పి సొమ్ము కాజేస్తారు. అలాంటి సంఘటనే భాగ్యనగరంలో చోటుచేసుకుంది. ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

nampally-police-nabbed-atm-cards-diverting-attention-offnder
సాయం చేసి... సొమ్ము దోచుకెళ్లాడు
author img

By

Published : Jun 11, 2020, 9:33 PM IST

Updated : Jun 11, 2020, 11:02 PM IST

ఏటీఎం మిషన్​లో డబ్బులు డిపాజిట్​ చేయడానికి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగి వచ్చేటపుడు మోసపోయాడు. హైదరాబాద్‌ మసాబ్ ట్యాంక్‌లోని పోచమ్మ బస్తీలో గాడిపల్లి యాదగిరి నివాసం ఉంటున్నారు. డబ్బులు జమ చేసేందుకు ఏటీఎం డిపాజిట్​ కేంద్రానికి వెళ్లాడు. అప్పటికే ఆ ఏటీఎం లోపల విద్యా సాగర్ అనే వ్యక్తి ఉన్నాడు. యాదగిరి డబ్బును డిపాజిట్​ చేసేందుకు అతన్ని సహాయం కోరాడు.

అది అదునుగా తీసుకున్న విద్యాసాగర్​... అతన్ని మాటల్లో పెట్టి ఏటీఎం కార్డ్ పిన్ నంబర్ తెలుసుకున్నాడు. ఆ తరువాత యాదరిగి చెప్పిన ఖాతాలో రూ. 42,500 జమ చేశాడు. డబ్బులు జమ చేసిన తర్వాత విద్యాసాగర్​ అతని ఏటీఎం కార్డును తీసుకుని అలాంటి మరో కార్డును యాదగిరికి ఇచ్చాడు. అది గమనించని యాదగిరి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తీసుకున్న ఏటీఎం కార్డుతో విద్యాసాగర్​ రూ. 41, 100 డ్రా చేసి తీసుకెళ్లాడు.

మోసపోయానని తెలుసుకున్న యాదరిగి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచాక్యంగా నిందితున్ని పట్టుకున్నారు. విద్యాసాగర్​ వద్దనుంచి రూ. 19, 600 స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. అతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు ప్రాంతమని పేర్కొన్నారు. అతనిపై అనేక కేసులు ఉన్నాయని... గతంలో 5 ఏళ్లు రాజమండ్రి జైలులో శిక్ష సైతం అనుభవించి వచ్చాడని పోలీసులు వివరించారు.

ఇదీ చూడండి : డ్రైవర్​కు కరోనా... హోం క్వారంటైన్​లో జీహెచ్​ఎంసీ మేయర్​ కుటుంబం

Last Updated : Jun 11, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.