ETV Bharat / state

ప్రభుత్వం అండగా ఉంటుంది: రంజిత్​రెడ్డి - చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి తాజా వార్తలు

వరదల్లో చిక్కుకుని చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ రంజిత్​రెడ్డి పేర్కొన్నారు. గగన్​పహాడ్ వద్ద వరదల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోగా.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు.

MP Ranjit Reddy provided financial assistance to the affected families
ప్రభుత్వం అండగా ఉంటుంది: రంజిత్​రెడ్డి
author img

By

Published : Oct 17, 2020, 8:07 AM IST

భారీ వర్షాల కారణంగా వరదల్లో చిక్కుకుని మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​ నగర శివారులోని గగన్​పహాడ్ అప్ప చెరువు తెగిపోవడం వల్ల వరదల్లో కొట్టుకుపోయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందగా.. బాధిత కుటుంబ సభ్యులను ఎంపీ పరామర్శించారు. జరిగిన దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు.

MP Ranjit Reddy provided financial assistance to the affected families
బాధిత కుటుంబీకులతో మాట్లాడుతున్న ఎంపీ

బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.50,000 ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల పరిహారంతో పాటు డబుల్​ బెడ్​రూం ఇంటిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్​ గౌడ్​, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.

బతుకమ్మ పండుగ.. తెలంగాణ మహిళలకే ప్రత్యేకం: లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.