రంగారెడ్డి జిల్లాలో ఇటీవల సంచలనం సృష్టించిన... ప్రియుడుతో కలసి కూతురు.... తల్లిని హత్య చేసిన కేసులో... పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునగనూరులో 19 ఏళ్ల కీర్తి... కన్న తల్లిని కడతేర్చిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికే ఈ కేసులో కీర్తి తోపాటు ప్రియుడు శశి అలియాస్ చంటిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కీర్తి తల్లి రజితను హత్య చేయడానికి గల కారణాలేంటి.. హత్యకు దారితీసిన విషయాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరితోపాటు కీర్తికి మొదటగా పరిచయం ఉన్న బాల్ రెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం చేస్తున్న బాల్ రెడ్డితో కీర్తికి ఉన్న పరిచయం.. హత్య అనంతరం బాల్ రెడ్డి ఇంట్లోనే ఉండటం.. తదితర విషయాలపై వీరిని పోలీసులు విచారిస్తున్నారు.
మరోవైపు కీర్తికి శశికి పరిచయం... వీరు ఇద్దరే ఈ హత్యను చేశారా, ఇతరుల సహాయం తీసుకున్నారా, మృతదేహాన్ని తరలించిన కారు ఎవరిదనే వివిధ కోణాలలో విచారణ జరుగుతోంది. అయితే కీర్తి ఒక్కతే కుమార్తె కావడంతో... ఆమెకున్న ఆస్తిపై కన్నేసిన శశి... రజితను హత్య చేయడానికి పూనుకున్నాడనే కోణంలో... ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: ప్రేమ కోసం.. తల్లిని చంపి తండ్రిపైనే ఫిర్యాదు