రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12, 21 వార్డుల్లో తెరాస అభ్యర్థులకు మద్దతుగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్రెడ్డి ప్రచారం నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి ఆయా వార్డుల్లో ఉన్న సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
ఎన్నికల్లో తెరాస అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్ద అంబర్పేట్, ఆదిభట్ల మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రచారంలో స్థానిక తెరాస నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల అభ్యర్థులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:పెళ్లింట చలిమంటల మర్యాద అదిరింది!