శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ డివిజన్ తులసీనగర్ కాలనీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. కార్పోరేటర్లు వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాస్, ఉప్పల పాటి శ్రీకాంత్తో కలిసి పనులు ప్రారంభించారు.
హామీ ఇస్తున్నా..
2కోట్ల 38లక్షల 50వేల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు మొదలు పెట్టారు. వీలైనంత త్వరగా అభివృద్ధి పనులు పూర్తి చేసేలా బాధ్యత తీసుకుంటానని ప్రజలకు గాంధీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెరాస నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సీఐ మల్లేష్ గారూ.. ఇలాగేనా ప్రవర్తించేదీ..?'