రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ లక్ష్మిబాయి పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కమల ప్రసన్న నగర్, ఆల్విన్ కాలనీ ఫేజ్-1 , వెంకటేశ్వర నగర్, జగద్గిరిగుట్ట ప్రధాన రహదారిపై పట్టణ ప్రగతి చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ కాలనీ రోడ్లపై పేరుకున్న చెత్త చెదారం తొలగించి.. పార చేతబట్టి పారిశుద్ధ్య పనులు నిర్వహించారు.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఇంట్లోని డ్రమ్ముల్లో, కూలర్లలో నిల్వ ఉన్న నీటిని వారానికి ఓ సారి తొలగించి శుభ్రం చేసి వాడుకోవాలని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. తద్వారా సీజనల్ వ్యాధులు, దోమల నివారణ సాధ్యమవుతుందని వెల్లడించారు. ఎక్కడైనా వర్షపు నీరు నిలిచి ఇబ్బందిగా ఉంటే జీహెచ్ఎంసీ సిబ్బందికి తెలియపరిస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని తెలిపారు. సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ ప్రశాంతి, హెల్త్ ఆఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'ఓ రోజు గడిచిపోయింది.. పరిహారం మాత్రం అందలేదు'