రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని షాబాద్, శంకర్ పల్లి, చేవెళ్ల మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డిలు పర్యటించారు. నియోజకవర్గ పరిధిలో ఐదు కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. చేవెళ్ల మండలం దేవరాంపల్లిలో మిషన్ భగీరథ నీటి సరఫరా తీరును పరిశీలించి మంత్రులు ఆ నీటిని తాగారు. భాజపా నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసిందేమి లేదని... కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను దేశంలో అమలు చేసేందుకు కొత్త పేర్లతో చాలీచాలని నిధులు కేటాయిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానికి అతి దగ్గరలో ఉన్న గ్రామాలకు రోడ్లు లేకపోవడం దారుణమన్నారు. ప్రతి గ్రామంలో 60 రోజుల ప్రణాళికలో భాగంగా మొక్కలు నాటాలని సూచించారు. మహిళా సంఘాలను బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రతి సభ్యురాలికి స్త్రీ నిధి కింద మూడు లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
ఇవీ చూడండి: న్యాయమూర్తుల నియామకాల్లో సమ ప్రాధాన్యం కావాలి: వినోద్