రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీ పహాడిషరీఫ్ ప్రాంతంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కరోనా చికిత్సా కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. కేంద్రంలో రోగులకు అందించే ఆహారాన్ని, మందులను పరిశీలించారు. వసతులపై అధికారులను ఆరా తీశారు.
36 గంటల్లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ కార్యరక్రమంలో మంత్రితో పాటు జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో స్వరాజ్యలక్ష్మి, బాలాపూర్ మండలం తహసీల్దార్ పాల్గొన్నారు.