ETV Bharat / state

sabitha indra reddy: 'పేద ప్రజలు ఆత్మగౌరవంగా బతికేందుకు ప్రభుత్వ కృషి' - double bed room houses distribution

sabitha indra reddy: రంగారెడ్డి జిల్లా​ మీర్​పేట్ కార్పొరేషన్​లోని లెనిన్​నగర్​లో నిర్మాణం పూర్తైయిన 80 డబుల్ బెడ్​ రూం ఇళ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

sabitha indra reddy
sabitha indra reddy
author img

By

Published : Dec 23, 2021, 7:25 PM IST

sabitha indra reddy: పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తుందని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట్ కార్పొరేషన్​లోని లెనిన్​నగర్​లో నిర్మాణం పూర్తైయిన 80 డబుల్ బెడ్​ రూం ఇళ్లను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. లెనిన్ నగర్​లోని మూడున్నర ఎకరాల స్థలంలో 260 మంది లబ్ధిదారులకు 10 బ్లాకుల్లో నిర్మాణం చేపట్టగా... 5 బ్లాకులు పూర్తయ్యాయి.

లాటరీ పద్ధతిలో డ్రా తీయగా.. మొదటి విడతలో 80 మంది లబ్ధిదారులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందజేశారు. మిగతా లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ఇళ్లను కేటాయిస్తామని మంత్రి తెలిపారు. 2 లక్షల 84 వేల డబుల్ బెడ్​రూం ఇళ్లను రాష్ట్రంలో మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.