ETV Bharat / state

ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉంది: మంత్రి సబితా - రంగారెడ్డి వార్తలు

రాష్ట్రంలో ప్రైవేటు విద్యాలయాలు పున:ప్రారంభమయ్యేవరకు ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్​లో ప్రైవేటు ఉపాధ్యాయులకు నగదు, బియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

rangareddy district, maheswaram
sabitha indra reddy
author img

By

Published : Apr 21, 2021, 6:31 PM IST

కష్టకాలంలోనూ ప్రైవేటు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్​ మండలంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి నగదు, బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశంలో ఎక్కడా చేయని విధంగా రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం అండగా ఉందని మంత్రి పేరొన్నారు. సుమారు 2,900 మెట్రిక్​టన్నుల బియ్యం, రూ.31 కోట్ల వరకు అవసరం అవుతుందని... మంత్రి తెలిపారు. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. సీఎం కేసీఆర్​ కొవిడ్​ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇదీ చూడండి: 'ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా ఆర్థిక సాయం పంపిణీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.