రైతు సంక్షేమం కోసం తెరాస అనేక పథకాలను ప్రవేశపెట్టిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలో రూ. 65 లక్షల నిధులతో జిల్లా సహకార బ్యాంక్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మొబైల్ ఏటీఎం కేంద్రాన్ని, సిరిపురంలో రైతు వేదికను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల కోసం పని చేస్తున్నారని మంత్రి సబిత అన్నారు. రైతును రాజుగా చూడాలన్నది కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. మహేశ్వరం మండల కేంద్రంలో 4 లైన్ రోడ్డు, డిగ్రీ, ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశం పట్ల ఆమె సానుకూలంగా స్పందించారు.
ఇదీ చూడండి: ఐదో తరగతి వరకు బడులుండవ్..!