రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో నూతనంగా నిర్మించిన మార్కెట్‌యార్డు భవనాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య అభ్యర్థనపై మార్కెట్ బిల్డింగ్ కట్టడం జరిగిందని తెలిపారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎంపీపీ గోవర్ధన్, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ రాజు నాయక్, గుడిమల్కాపూర్ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ధర్మాన వెంకట్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం