ETV Bharat / state

తెరాస పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిబాట: కేటీఆర్​

షాద్​నగర్​లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కొత్తూర్​ పురపాలికకు మంజూరైన నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ktr, telangana cm kcr
తెరాస పాలనలోనే రాష్ట్రం అభివృద్ధిబాట: కేటీఆర్​
author img

By

Published : Apr 14, 2021, 2:56 PM IST

Updated : Apr 14, 2021, 9:22 PM IST

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్​ పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. షాద్​నగర్​ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన కొత్తూర్​ పురపాలికకు మంజూరైన నూతన భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. షాద్​నగర్​ ప్రాంత ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈ సంవత్సరంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

షాద్​నగర్​ పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. విద్య, వైద్యం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను ఆదుకోవడానికి సీఎం కేసీఆర్​ పలు పథకాలు ప్రవేశపెట్టారని వెల్లడించారు. అందరి ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. తెరాసకు మద్దతు ఇవ్వాలని కోరారు.

ఈ సందర్భంగా కొత్తూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన పలువురు కాంగ్రెస్​ నాయకులను పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. రూ.3.50 కోట్లతో నూతన భవనం నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్​ తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్​గౌడ్​, ఎంపీ శ్రీనివాస్​రెడ్డి, జడ్పీ ఛైర్మన్​ అనితారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఇవీచూడండి: బాబాసాహెబ్​కు మోదీ, రాహుల్ నివాళి

Last Updated : Apr 14, 2021, 9:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.