జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలు అమ్మి ప్రచారం నిర్వహించారు. అభ్యర్థి ప్రభుదాస్తో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థిని గెలిపించాలని కోరారు.
కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి ఉండడం మన అదృష్టమని, ప్రజల కష్టాలు తెలుసు కాబట్టే సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ ప్రకటించిన కొత్త పథకాలు ప్రజలకు మేలు చేస్తాయని భావించారు. డిసెంబర్ నుంచి జీహెచ్ఎంసీ ప్రజలందరికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీటి సరఫరా చేస్తామని తెలిపారు.
దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణని రెండో స్థానంలో నిలబెడతామన్నారు. హైదరాబాద్లో ప్రశాంత వాతావరణం ఉన్నందునే రూ. లక్షల కోట్ల పెట్టబడులు నగరానికి వస్తున్నాయని స్పష్టం చేశారు. గ్రేటర్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి: రాంగోపాల్పేటలో తెరాస చేసిన అభివృద్ధి శూన్యం: శీలం ప్రభాకర్