Ramanuja Sahasrabdi Utsav: ముచ్చింతల్ క్షేత్రం దేశంలోనే గొప్ప క్షేత్రంగా మారుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో ఇంత గొప్ప వేడుకలు జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని సమతామూర్తి కేంద్రాన్ని మంత్రి ఎర్రబెల్లి, ప్రముఖ పారిశ్రామిక వేత్త వరప్రసాద్ రెడ్డి సందర్శించారు. రామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు.. పదకొండో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారని ఎర్రబెల్లి అన్నారు.
మంచి కోసం జీవితం అంకితం
ఓట్లు, పదవి కోసం కాకుండా వెయ్యేళ్ల కిందటే సమైక్యవాదాన్ని వినిపించిన మహనీయుడు రామానుజాచార్యులని వరప్రసాద్ రెడ్డి కొనియాడారు. మంచి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహామూర్తి అని పేర్కొన్నారు. సమతామూర్తి కేంద్ర ఆవిర్భవాన్ని ఆయన కీర్తించారు. మంచికి ఎప్పుడూ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయని.. కానీ ఎప్పటికైనా మంచే గెలుస్తుందని రామానుజాచార్యులు నిరూపించారని వరప్రసాద్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: 'రాష్ట్ర విభజన జరిగి రెండుగా విడిపోయి ఉండవచ్చు.. కానీ'