రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు నుంచి స్వచ్ఛందంగా మినీ లాక్డౌన్ విధించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల వరకు లాక్డౌన్ కొనసాగనుంది.
ఇబ్రహీంపట్నంలో రోజురోజుకు కరోనా కేసులు అధికం అవుతుండడం వల్ల ఎవరికివారు స్వీయనియంత్రణకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు మున్సిపాలిటీలో మినీ లాక్డౌన్ అమలు చేయనున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకే ఈ మినీ లాక్డౌన్ అని.. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ కప్పరి స్రవంతి, కమిషనర్ జయంత్ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ ఆకుల యాదగిరి అన్నారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలి: హరీశ్ రావు