ETV Bharat / state

రావిర్యాలలో మెగా డెయిరీ ఏర్పాటుకు అడుగులు.. - rangareddy district news

రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో మెగా డెయిరీ కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. అద్దె ప్రాతిపదికన ఈ భూమి కేటాయిస్తూ పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

Mega DairyMega Dairy set up at raviryala, rangareddy district
రావిర్యాలలో మెగా డెయిరీ ఏర్పాటుకు అడుగులు..
author img

By

Published : Jul 28, 2020, 4:18 PM IST

ఎట్టకేలకు మెగా డెయిరీ ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. రాజధాని హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో మెగా డెయిరీ కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. సర్వే నంబరు 1/1 ఐమర్త్ కంచలో పశుసంవర్థక శాఖకు చెందిన 32.20 ఎకరాల విస్తీర్ణం భూమిని తెలంగాణ రాష్ట్ర పాడిపరిశ్రామిభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్‌ - టీఎస్‌డీడీసీఎఫ్‌ఎల్‌కు కేటాయించింది.

అద్దె ప్రాతిపదికన ఈ భూమిని కేటాయిస్తూ పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని రావిర్యాలలో పెద్ద ఎత్తున షీప్ బ్రీడింగ్ ఫాం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఆ పక్కనే ఈ భూమిని మెగా డెయిరీ కోసం కేటాయించిన దృష్ట్యా నెలకు ఎకరానికి 30 వేల రూపాయలు చొప్పున 99 ఏళ్లపాటు... షీప్ బ్రీడింగ్ ఫాంకు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ లీజ్ ... ప్రతి ఏటా 5 శాతం చొప్పున పెరుగుతుంది. ఈ భూమిని ఇతరులకెవరికీ సబ్‌ లీజ్‌కు ఇవ్వకూడదు. త్వరలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సమక్షంలో... పశుసంవర్థక శాఖ సంచాలకులు, టీఎస్ పాడిపరిశ్రామిభివృద్ధి సహకార సంస్థ ఎండీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు.

ఇదీ చదవండి : 'సచివాలయ కూల్చివేత ఎలా జరుగుతోంది.. వ్యర్థాల పరిస్థితి ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.