ETV Bharat / state

ఏళ్ల చరిత్ర కలిగిన మాసబ్ చెరువును.. ఆక్రమించిన భూబకాసులు - మాసాబ్ చెరువు కబ్జా

Masab Pond Occupy In Turkanyala Municipality: రాష్ట్రంలో భూబకాసురుల దాహానికి హద్దే లేకుండా పోతుంది. చెరువులను సైతం కబ్జా చేసేస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మాసబ్ చెరువును కబ్జా చేశారు. స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం శూన్యమే.

masaab pond
మాసాబ్ చెరువు
author img

By

Published : Mar 14, 2023, 4:21 PM IST

Masab Pond Occupy In Turkanyala Municipality: రాష్ట్రంలో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు.. అక్రమార్కులు, భూబకాసురులు అక్కడ వాలిపోతున్నారు. ఈ మధ్య కాలంలో చెరువులను కూడా కబ్జా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ మండల పరిధి తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని మాసబ్ చెరువును ఓ రియాల్టర్ కబ్జా చేశాడు. ఎఫ్ టి .ఎల్ పరిధిలో ఉన్న ఆ చెరువును.. రాత్రి సమయంలో గుట్టుచప్పుడుగా టిప్పర్లతో మట్టిని చెరువులో డంపు చేశాడు. ఇంత చేస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎంతో చారిత్రాత్మక చెరువుగా ప్రసిద్ధి చెంది.. తుర్కయంజాల్​కు తలమానికమైన మాసబ్​ చెరువు 320 ఎకరాల్లో విస్తీర్ణం విస్తరించి ఉంది. అయితే ఈ చెరువుకు అనుకొని ఉన్న 205 సర్వే నంబర్​లో కోట్ల రూపాయలు విలువ చేసే 12 ఎకరాల భూమి ఉందని స్థానికులు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా మాసబ్​ చెరువు నిండా నీరు ఉండడంతో కబ్జాదారులు వెనకడుగు వేస్తూ వచ్చారని.. ఇప్పుడు నీరు తగ్గుముఖం పట్టడంతో కబ్జాకు వీలైందని వారు పేర్కొన్నారు.

గత 15 రోజుల నుంచి ఎఫ్.టీ.ఎల్​ ప్రాంతాన్ని ఆక్రమించే పనిలో భాగంగా రాత్రి సమయాల్లో పెద్ద ఎత్తున మట్టిని డంపు చేసేవారని చెప్పారు. ఈ చెరువు సుందరీకరణకు మంత్రి కేటీఆర్ గతంలో రూ.2కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించారన్నారు. చెరువు అభివృద్ధికి కూడా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని వివరించారు.

కొన్ని ఏళ్ల తర్వాత భారీ వర్షాలకు చెరువు అలుగు ప్రవహించింది. అదే సమయంలో చెరువుతో పాటు బఫర్ జోన్​లోనూ పెద్ద ఎత్తున నీరు నిలిచింది. దీంతో నీరు తగ్గిందని గ్రహించి 6 అడుగుల మేర మట్టిని చెరువులో డంప్ చేశారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు, దృష్టిచారించి చెరువును రక్షించి, బాధ్యులను శిక్షించాలని.. లేకపోతే అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరించారు.

"ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు. కబ్జాదారులు ఎంతటి వారినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నాగార్జున సాగర్ రహదారికి అనుకొని ఉన్న విలువైన భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వీరిపై చట్టప్రకారం కఠినచర్యలు తీసుకోవాలి. మాసబ్ చెరువును సరిహద్దు చేసి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలి." - మల్​రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే

ఏళ్ల చరిత్ర కలిగిన మాసబ్ చెరువును.. ఆక్రమించిన భూబకాసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.