రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం హర్షగూడ తండా పహాడిషరీప్ పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనను ఎంఆర్‌పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఖండించారు. ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేసి శిక్షపడే విధంగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రసాద్‌రెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫారంలో పని చేస్తున్న గిరిజన మహిళ వేతన బకాయిలు అడిగినందుకు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.... నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. నిత్యం ఎక్కడో ఓ చోట ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: మహిళపై అత్యాచారం.. నలుగురు నిందితుల అరెస్టు