రంగారెడ్డి జిల్లా షాద్నగర్ సమీపంలోని బుర్గుల గేట్ వద్ద అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. బాలానగర్ మండలం మోతీఘనపూర్కు చెందిన రాఘవేంద్ర అనే వ్యక్తి 44వ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు గంజాయి విక్రయిస్తున్నాడనే సమాచారంతో కాపుకాచి పట్టుకున్నారు. నిందితుని నుంచి 375గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకుని... రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: ఆడుకుంటున్న చిన్నారిని ఢీకొట్టిన డీసీఎం