లాక్డౌన్ నేపథ్యంలో లారీలు అడ్డాలకే పరిమితమయ్యాయని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నందారెడ్డి తెలిపారు. ఈ సమయంలో లారీ కిస్తికి సంబంధించి వడ్డీని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. మారిటోరియం వేళ వడ్డీని ఆర్బీఐ లేక ప్రభుత్వమే భరించాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంరెడ్డి విజ్ఞప్తి చేశారు.
రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం ఆటోనగర్‌లోని లారీల అడ్డా వద్ద తెలంగాణ స్టేట్ లారీ యజమానులు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిత్యవసర సరకులు పంపిణీ చేశారు. సుమారు 600 మంది రవాణా రంగ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులకు తొమ్మిది రకాల సరకులను అందించారు.
ఇవీచూడండి: వైద్యులు ప్రాణాలను పణంగా పెడుతున్నారు: ఈటల