Liver Health Screening Package: రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ కామినేని ఆసుపత్రిలో లివర్ హెల్త్ స్క్రీనింగ్ ప్యాకేజీని ప్రారంభించారు. ప్రజల్లో ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంపొందించాలని ఉద్దేశంతో ఈ ప్యాకేజీని ప్రకటించినట్లు వైద్యులు తెలిపారు. దీర్ఘకాలికంగా కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ.. ఎక్కువ ఖర్చు వెచ్చించలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి 15 వరకు ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుందని వివరించారు.
ఈ ప్యాకేజీ ధర రూ.1700గా నిర్ణయించామని తెలిపారు. ఆహారపు అలవాట్లు, జీవన ప్రమాణాల కారణంగా.. మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల ఎక్కువ మంది కాలేయ సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని వివరించారు. ఈ క్రమంలోనే అటువంటి వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లివర్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిదని సూచించారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కామినేని వైద్యులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: 'శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాము.. ఎవరితో పొత్తు ఉండదు'
సురేశ్ రైనా అత్తామామల హత్యకేసు.. నిందితుడిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు