రాష్ట్ర ప్రభుత్వం అభ్కారీ శాఖ అధ్వర్యంలో హైదరాబాద్ నాగోల్‌లో లాటరీ ద్వారా 2021కి నూతన బార్లను ఎంపిక చేశారు. దరఖాస్తుదారులు భారీగా హాజరయ్యారు. 55 బార్లకుగాను 1,338 అప్లికేషన్లు వచ్చాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంఛార్జీ ఎక్సైజ్ కమిషనర్ నీతూప్రసాద్, జాయింట్ కమిషనర్ అజయ్‌రావు హాజరయ్యారు. లాటరీ ద్వారా 55 బార్ల లబ్దిదారులను ఎంపిక చేశారు. ఆ బార్లు జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడైనా పెట్టుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఇదీ చూడండి : న్యాయవాదుల నిరసనలో ఉద్రిక్తత.. లాయర్‌పై వ్యక్తి దాడి