ETV Bharat / state

Ramoji Foundation: అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా​కు శంకుస్థాపన.. రామోజీ ఫౌండేషన్​కు మంత్రుల కృతజ్ఞతలు - అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా​కు శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ నూతన భవనానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. రామోజీ ఫౌండేషన్​ సహకారంతో పీఎస్​ను నిర్మిస్తున్నారు. ప్రభుత్వం తరఫున రామోజీ ఫౌండేషన్​కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు కృతజ్ఞతలు తెలిపారు.

laid foundation stone for abdullapurmet police station

author img

By

Published : Jul 1, 2021, 3:15 PM IST

Updated : Jul 1, 2021, 8:06 PM IST

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఠాణా​కు శంకుస్థాపన

ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న రామోజీ పౌండేషన్.. పోలీస్ శాఖకు తన వంతు సాయం అందించేందుకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు రామోజీ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీ సమీపంలో జాతీయ రహదారి పక్కనే అధునాతన భవన నిర్మాణానికి భూమిపూజ, శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి, రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రామోజీ ఫిల్మ్​ సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తున్న రామోజీ ఫౌండేషన్​ను మంత్రులు అభినందించారు. రాష్ట్ర పోలీసులు.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, అలాంటి వారికి భవనం నిర్మించి ఇస్తున్నందుకు రామోజీ ఫౌండేషన్​కు ప్రభుత్వం తరఫున.. మంత్రులు ధన్యవాదాలు తెలిపారు.

అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్ స్టేషన్ 2017 అక్టోబర్ 11న అందుబాటులోకి వచ్చింది. జాతీయ రహదారి పక్కనే తాత్కాలిక భవనంలో పోలీస్ స్టేషన్​ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనం కూడా రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చారు. మూడున్నరేళ్లుగా అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్ స్టేషన్​ ఆ భవనంలోనే కొనసాగుతోంది. ఆధునిక సదుపాయాలతో కూడిన విశాలమైన భవనాన్ని నిర్మించి ఇచ్చేందుకు రామోజీ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. ఏడాది లోపు ఈ భవనాన్ని పూర్తి చేసి పోలీస్​ శాఖకు అప్పజెప్పనున్నారు.

ఆధునిక సదుపాయాలు.. ఆహ్లాదకరమైన వాతావరణం

భవనం గ్రౌండ్​ ఫ్లోర్​తో పాటు మొదటి అంతస్తు కలిపి 9 వేల చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. పీఎస్​ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా నిర్మాణం ఉండనుంది. భవనం లోపల సీఐకి ప్రత్యేక గదితో పాటు డిటెక్టివ్ డిపార్ట్ మెంట్​కు ప్రత్యేక గదులు ఉండనున్నాయి. హాల్​లో రిసెప్షన్​తో పాటు, ఎస్సైలు కూర్చోవడానికి క్యాబిన్లు ఏర్పాటు చేసేలా నిర్మాణం ఉంటుంది. భవనం బయటి నుంచి చూడగానే ఆకట్టుకునే విధంగా డిజైన్ చేశారు. పోలీసులకు విశ్రాంతి గది, మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక గదులూ ఇందులో ఉండనున్నాయి.

అబ్దుల్లాపూర్​మెట్​ పీఎస్ పరిధిలో దాదాపు 60 వేల జనాభా ఉంది. సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఏఎస్సై, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు, నలుగురు హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. 24 గ్రామాలు పీఎస్ పరిధిలోకి వస్తాయి. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిలో కొన్ని కిలోమీటర్లు కూడా పీఎస్ పరిధిలోకి వస్తుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని పోలీస్​ స్టేషన్​ను నిర్మిస్తున్నారు. సిబ్బంది పెరిగినా తగిన విధంగా సర్దుబాటు అయ్యేలా విశాలంగా నిర్మించనున్నారు. నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగడంపై పోలీసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాచకొండ కమిషనరేట్​కు నేటికి ఐదేళ్లు..

2015 జులై 1న రాచకొండ కమిషనరేట్​ ప్రారంభమైందని సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. నేటికి ఐదేళ్లు గడిచిందన్నారు. ఇదే రోజున అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ నూతన భవనానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు.

ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు..

ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. రామోజీరావు తన సంస్థ తరఫున సుమారు రెండు కోట్ల రూపాయలు ఇచ్చి అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ కట్టించడం హర్షించ దగ్గ విషయం. ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు సేవా కార్యక్రమాలు చాలా చేశారు. రామోజీరావు ఆరోగ్యం, వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నా.

-ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్ర పంచాయతీరాజ్​ శాఖ మంత్రి

మేముసైతం..

అబ్దుల్లాపూర్​మెట్​ పోలీస్​స్టేషన్​ అధునాతన భవనానికి రామోజీ ఫౌండేషన్​ తరఫున సుమారు రూ.2 కోట్లు ఇవ్వడం పట్ల ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దినదినాభివృద్ధి చెందుతున్న నగరం కోసం మేము సైతం అని ముందుకొచ్చిన రామోజీరావుకు ధన్యవాదాలు. దేశంలోనే నంబర్​ 1గా పేరొందిన తెలంగాణ పోలీసులకు అండగా నిలిచిన పెద్దలకు నమస్కారం.

- సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

రామోజీ ఫౌండేషన్​కు మంత్రుల కృతజ్ఞతలు

ఇదీచూడండి: Minister srinivas Goud : మీ వాటా తేల్చుకుని.. నీళ్లు తీసుకెళ్లండి

Last Updated : Jul 1, 2021, 8:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.