రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలోని చింతల్‌కుంటలో వాసవి శ్రీ నిలయంలో వినాయకుడి లడ్డూ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో పాల్గొన్న వ్యాపారవేత్త తుడి శ్రీనివాస్ రెడ్డి.. రికార్డు స్థాయి ధర రూ.8.35 లక్షలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. హోరాహోరీగా జరిగిన వేలం పాటలో తాడిశెట్టి దయాకర్ పాల్గొనగా.. చివరగా తుడి శ్రీనివాస్ రెడ్డి అత్యధిక ధరతో వేలంలో లడ్డూను గెలుచుకున్నారు.
వినాయకుడి ఆశీస్సుల వల్లే తాను లడ్డూ పొందగలిగానని తుడి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరిపై ఆ విఘ్నేశ్వరుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి : ప్రేమ ఉద్యోగానికి నా వయసు సరిపోదని వదిలేసి వెళ్లావా..?
దేశంలోనే అతి పొడవైన వంతెన నిర్మాణం.. ఇక సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపు ఈజీ!