ETV Bharat / state

అందుకే ప్రజాప్రతినిధులపై చులకనభావం: కేటీఆర్​

శంషాబాద్​లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ సమక్షంలో సబిత తనయుడు కార్తీక్​రెడ్డి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి కార్తీక్​రెడ్డి పోటీ చేయనున్నట్లు సమాచారం.

శంషాబాద్​లో ప్రసంగిస్తున్న కేటీఆర్​
author img

By

Published : Mar 20, 2019, 12:07 AM IST

శంషాబాద్​లో ప్రసంగిస్తున్న కేటీఆర్​
శంషాబాద్​లో కేటీఆర్​ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్​ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చేవెళ్ల నుంచి సబిత మద్దతుదారులు తెరాసలో చేరారు. కాంగ్రెస్ నాయకుల తీరు వల్ల ప్రజాప్రతినిధులంటే ప్రజల్లో చులకనభావం ఏర్పడుతుందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మేము ఆ మాట అన్నామా?

నాయకులు పార్టీలు మారడం పట్ల కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన కేటీఆర్ ... రాహుల్ గాంధీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఎంతకు కొన్నారని ప్రశ్నించామా అంటూ పేర్కొన్నారు.సారు, కారు, పదహారు, దిల్లీలో సర్కారు దిశగా ముందుకెళ్దామని కార్యకర్తలకు సూచించారు. రాష్ట్రంలో 16 మంది తెరాస లోక్‌సభ సభ్యులను గెలిపిస్తే ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగరేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించవచ్చని కేటీఆర్​ వెల్లడించారు.

ఇవీ చూడండి:మేమూ హిందువులమే: కేసీఆర్​

Intro:TG_KRN_101_19_PATTABADHRULA_MLC ENNIKALA_PRACHARA SABHA_AVB_C11
FROM:KAMALAKAR HUSNABAD C11
---------------------------------------------------------------------------- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఉమ్మడి నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి సుగుణాకర్ రావు గారికి మద్దతుగా హుస్నాబాద్ బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చాడ శ్రీనివాస రెడ్డి గారి ఆధ్వర్యంలో పట్టభద్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంద్రసేనా రెడ్డి గారు మాట్లాడుతూ బిజెపి పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉమ్మడి నాలుగు జిల్లాల నుండి సుగుణాకర్ రావు గారు పోటీ చేస్తున్నారని, తెరాస ప్రభుత్వం నిరుద్యోగులకు, ఉద్యోగులకు అన్యాయం చేసిందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఇప్పుడు 16 ఎంపీ స్థానాలు కావాలి అని కేంద్రంలో మన పెత్తనం కొనసాగుతుందని అంటున్నారు, కానీ గత ఐదేళ్ల క్రితం నుండి ఒక రెండు స్థానాలు తప్ప 15 ఎంపీ స్థానాలు పార్లమెంట్లో కలిగి ఉండి కూడా ఏమి చేయలేని ఆయన ఇప్పుడు ఏం చేస్తానని 16 ఎంపీ స్థానాలు కావాలని అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడానికి ప్రతిపక్షం అవసరమని అలాంటి ప్రతిపక్షం లేకుండా నిర్వీర్యం చేస్తున్న చంద్రశేఖర రావు గారికి గుణపాఠం చెప్పాలని, అందుకే మీ మొదటి ప్రాధాన్యత ఓటు సుగుణాకర్ రావు గారికి వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు.

Body:బైట్

1) నల్లు ఇంద్రసేనారెడ్డి బిజెపి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు

Conclusion:హుస్నాబాద్ పట్టణంలో ఉమ్మడి నాలుగు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.