ETV Bharat / state

KTR Launch Vijaya Mega Dairy Plant at Raviryala : రాష్ట్రంలో పాడి రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు: మంత్రి కేటీఆర్ - మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్​

KTR Launch Vijaya Mega Dairy Plant at Raviryala : ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లు దేశవ్యాప్తంగా రైతుల ఆదాయం రెట్టింపు కాకపోయినా.. తెలంగాణలో మాత్రం రైతులకు సంపూర్ణ న్యాయం జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద రూ.250 కోట్ల వ్యయంతో నిర్మించిన తెలంగాణ విజయ మెగా డెయిరీ ప్లాంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.

Vijaya Mega Dairy Plant in Rangareddy District
KTR Launch Vijaya Mega Dairy Plant
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 5, 2023, 8:07 PM IST

KTR Launch Vijaya Mega Dairy Plant at Raviryala : తెలంగాణ​ సర్కార్​ అవలంభిస్తున్న విధానాల వల్ల.. రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి గణనీయంగా పెరుగుతోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. రావిర్యాలలో నిర్మించిన మెగా డెయిరీ ప్లాంట్​ను ఆయన ప్రారంభించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన.. మెగా డెయిరీ ప్లాంట్​ను రికార్డు స్థాయిలో రెండేళ్లలోపే నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

KTR Comments on Congress and BJP : కాంగ్రెస్​ తరఫున గెలిచిన వాళ్లు.. బీజేపీలోకి జంప్‌ అవుతారు: మంత్రి కేటీఆర్

Vijaya Mega Dairy Plant in Rangareddy District : దేశంలోనే అతి పెద్దదైన తెలంగాణ విజయ డెయిరీ మెగా ప్లాంట్​ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. ఈ ఘనత సాధించిన మంత్రి తలసాని, అధికార బృందానికి అభినందనలు తెలియజేశారు. అనాదిగా పెద్దలు పాడి పంట అంటారు.. పంటలో పాడి కూడా అంతర్భాగంగా ఉంటుందని ప్రస్తావించారు. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ డెయిరీలు, రైతులను నిరుత్సాహపరిచాయని దుయ్యబట్టారు. ఈ క్రమంలో విజయ డెయిరీని నిర్వీర్యం చేశాయని ఆక్షేపించారు.

త్వరలోనే పెండింగ్‌లో ఉన్న రూ.4 ప్రోత్సాహం నిధులు అందజేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో విజయ డెయిరీకి 1.5 నుంచి 4 లక్షల లీటర్ల సరఫరా సామర్థ్యం పెరిగి లాభాల బాట పట్టిందని హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.350 కోట్లు ప్రోత్సాహం కింద పాడి రైతులకు అందజేసినట్లు గుర్తు చేశారు. మిగతా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహం నిధులను కూడా సీఎం ఇస్తారని తెలిపారు.

White Revolution in Telangana : స్వరాష్ట్రంలో ఇప్పటి దాకా రుణమాఫీ కింద రూ.21 వేల కోట్లు రైతులకు పంపిణీ చేశామని వెల్లడించారు. కరోనా వల్ల వ్యవసాయం దెబ్బతిన్నా ఏదీ ఆపలేదని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రైతుబంధు కింద రూ.73 వేల కోట్లు, నిరంతర విద్యుత్​ కోసం ఏటా రూ.10 వేల కోట్లు వెచ్చిస్తున్నమని తెలిపారు. మరో రూ.1500 కోట్లు రైతు బీమా పథకం అమలు కోసం కేటాయిస్తున్నట్లు స్పష్టం చేశారు.

2014లో ప్రధాని మోదీ.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని హామీ ఇచ్చారు. ఏ ఒక్క రైతుకైనా ఆదాయం రెట్టింపు అయిందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో తప్ప.. మిగతా రాష్ట్రాల్లో రైతుల కష్టాలు పెరిగాయని కేటీఆర్ ధ్వజమెత్తారు. కార్పోరేట్​ పెద్దలకు వంతపాడుతున్న మోదీ.. దేశ రైతాంగానికి మొండి చేయి చూపుతున్నారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెట్టారని విమర్శించారు.

రాష్ట్రంలో పాడి రైతాంగ సంక్షేమం కోసం.. కేసీఆర్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని మంత్రి తలసాని అన్నారు. ఎన్నడూ లేని విధంగా పాడి రంగం, రైతులకు మద్దతు ఇవ్వడం వల్ల శ్వేత విప్లవం సాకారమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. 2014 కంటే ముందు విజయ డెయిరీ నిరాదరణకు గురైందని.. తెలంగాణ ఆవిర్భావం నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం వల్ల రాష్ట్రంలో గణనీయంగా పాల ఉత్పత్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్​రెడ్డి, టీఎస్ విజయ డెయిరీ ఛైర్మన్ సోమ భరత్ కుమార్, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.

"తెలంగాణ​ సర్కార్​ అవలంభిస్తున్న విధానాల వల్ల.. రాష్ట్రంలో ఆర్థిక పరిపుష్టి గణనీయంగా పెరుగుతోంది. 2014లో ప్రధాని మోదీ.. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని హామీ ఇచ్చారు. ఏ ఒక్క రైతుకైనా ఆదాయం రెట్టింపు అయిందా..? తెలంగాణలో తప్ప.. మిగతా రాష్ట్రాల్లో రైతుల కష్టాలు పెరిగాయి. తెలంగాణలో ఐదు విప్లవాలతో రైతుల ఆదాయం డబుల్ అయ్యింది". - కేటీఆర్​, మంత్రి

KTR Launch Vijaya Mega Dairy Plant at Raviryala రాష్ట్రంలో పాడి రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు మంత్రి కేటీఆర్

Talasani on Mega Dairy in Raviryal : రావిర్యాల మెగా డెయిరీతో యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు

Mega Dairy Plant Opening : ప్రారంభానికి ముస్తాబైన మెగా డెయిరీ.. ప్రత్యేకతలేంటో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.