కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్లు దోచుకుంటున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా కర్మన్‌ఘాట్‌లోని ఓ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకుడు అంటే అందినకాడికి దోచుకోవడం కాదు... చనిపోయిన తరువాత కూడా ప్రజల మనసులో స్థిరస్థాయిగా గుర్తుండిపోయేలా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నీళ్లకు, నిథులకు కొదవలేదు: ఈటల