లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో హోటళ్లు మూసివేసి ఉండటం వల్ల ప్రయాణికులు భోజనం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని అన్నదాన కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని.. చేవెళ్ల కోర్టు న్యాయమూర్తి స్వాతిమురారి అన్నారు.
చేవెళ్ల కోర్టు జడ్జి స్వాతిమురారి భర్త అమిత్ కుమార్ ఆధ్వర్యంలో రెండోరోజు శనివారం షాబాద్ చౌరస్తా వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది అత్యవసర, తప్పని పరిస్థితుల్లో రోడ్డుపై ప్రయాణిస్తున్నారని.. వారికి భోజనం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారికోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. చేవెళ్లలో 100 మందిని గుర్తించి వారికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.