ETV Bharat / state

రైతుకు దన్నుగా సెస్-జయశంకర్ యూనివర్సిటీ పరిశోధనలు - CESS

వ్యవసాయ అంశాలపై కేంద్రీయ ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ- సెస్‌, జయశంకర్ వర్సీటీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లోని పీజేటీఎస్‌ఏయూలో జరిగిన సమావేశంలో ఒప్పందంపై సంతకాలు చేశారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పరిశోధనల కోసం ఈ ఒప్పందం దోహదపడుతుందని విశ్వవిద్యాలయం తెలిపింది.

పీజేటీఎస్‌ఏయూతో సెస్‌ కీలక ఒప్పందం
పీజేటీఎస్‌ఏయూతో సెస్‌ కీలక ఒప్పందం
author img

By

Published : Dec 5, 2019, 5:01 PM IST

వ్యవసాయ సంబంధిత అంశాలపై కలిసి పనిచేయాలని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ - సెస్‌ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు రాజేంద్రనగర్‌లోని వర్సిటీ పరిపాలన భవనంలో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. వెల్చాల ప్రవీణ్‌రావు, సెస్‌ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ సమక్షంలో... వర్సిటీ రిజిస్ట్రార్ డా. ఎస్.సుధీర్‌కుమార్, సెస్ సంచాలకులు డా. రేవతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

'పీజేటీఎస్‌ఏయూలో వ్యవసాయ విద్య... పరిశోధనల్లో మేటి'
ప్రొ. జయశంకర్ పేరిట ఏర్పాటైన ఈ వర్సిటీ ఐదేళ్ల కాలంలోనే వ్యవసాయ విద్య, పరిశోధనల్లో అభివృద్ధి సాధించిందని వీసీ తెలిపారు. రైతులకు విస్తృత సేవలు అందిస్తున్న తరుణంలో... అనేక నూతన స్వల్పకాలిక వంగడాలను అందుబాటులోకి తెచ్చామని వర్సీటీ వీసీ ప్రవీణ్‌రావు అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వ్యవసాయ విస్తరణ... కమ్యూనిటీ సైన్స్ విభాగం ద్వారా మహిళలు, పిల్లలకు గృహ సంబంధిత పోషకాహార అంశాల్లో సేవలందిస్తున్నామని వెల్లడించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పరిశోధనలు చేస్తున్న సెస్‌తో ఒప్పందం వల్ల రైతులకు, వ్యవసాయ రంగానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'స్ఫూర్తి ఫౌండేషన్​తో వర్సిటీ మరో కీలక ఒప్పందం'
వర్సీటీ, సెస్‌ సంస్థలు కలిసి సదస్సులు, పరిశోధనలు కొనసాగిస్తాయని వీసీ స్పష్టం చేశారు. నీటి నిర్వహణ , ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ తదితర అంశాల్లో తమ సంస్థ అనేక ప్రాజెక్టులు తయారు చేసిందన్నారు. పీజేటీఎస్‌ఏయూతో ఒప్పందం వల్ల మరింత మేలు జరుగుతుందని సెస్ డైరెక్టర్ రేవతి అన్నారు.

కరీంనగర్‌కు చెందిన స్ఫూర్తి ఫౌండేషన్‌, పీజేటీఎస్‌ఏయూ మధ్య కూడా మరో అవగాహన ఒప్పందం కుదిరింది. పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్ సుధీర్‌కుమార్‌, స్ఫూర్తి ఫౌండేషన్ ఛైర్మన్‌ కె.జగన్మోహన్‌ రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కీలక వ్యవసాయ పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపుపై కలిసి పనిచేస్తామని ఇరు సంస్థలు పేర్కొన్నాయి.

ఇవీ చూడండి : 'ఆర్టీసీపై భేటీ సమయంలో.. గుండె వేగంగా కొట్టుకుంది'

05-12-2019 TG_HYD_28_05_PJTSAU_CESS_MOU_AV_3038200 REPORTER : MALLIK.B Note : pics from desk whatsApp ( ) వ్యవసాయ సంబంధిత అంశాలపై కలిసి పనిచేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కేంద్రీయ ఆర్థిక, సామాజిక అధ్యయన సంస్థ - సెస్‌ సంయుక్తంగా నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిపాలన భవనంలో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, సెస్‌ ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.రాధాకృష్ణ సమక్షంలో... వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.సుధీర్‌కుమార్, సెస్ సంచాలకులు డాక్టర్ రేవతి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్, యూనివర్సిటీ అధికారులు పాల్గొన్నారు. నీళ్లు - నిధులు - నియామకాల నినాదంతో తెలంగాణ కోసం ప్రొఫెసర్ జయశంకర్ పేరిట ఏర్పాటైన వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐదేళ్లకాలంలో వ్యవసాయ విద్య, పరిశోధనల్లో అనేక విధాలుగా అభివృద్ధి సాధించింది. రైతులకు సేవలు విస్తృతం చేస్తున్న తరుణంలో... అనేక నూతన స్వల్పకాలిక వండగాలు అందుబాటులోకి తీసుకొచ్చామని వర్సిటీ ఉపకులపతి ప్రవీణ్‌రావు అన్నారు. కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వివిధ రకాల విస్తరణసహా కమ్యూనిటీ సైన్స్ విభాగం ద్వారా మహిళలు, పిల్లలకు గృహ సంబంధ, పోషకాహార అంశాల్లో సేవలందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో పరిశోధనలు చేస్తున్న సెస్‌తో ఒప్పందం వల్ల వ్యవసాయ రంగం, రైతాంగానికి మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వర్సీటీ, సెస్‌ సంస్థలు కలిసి సదస్సులు, పరిశోధనలు కొనసాగిద్ధామని వీసీ స్పష్టం చేశారు. నీటి యాజమాన్యం, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ తదితర అంశాల్లో తమ సంస్థ అనేక ప్రాజెక్టులు తయారు చేసిన దృష్ట్యా... పీజేటీఎస్‌ఏయూతో ఒప్పందం వల్ల మరింత మేలు జరుగుతుందని సెస్ డైరెక్టర్ రేవతి అన్నారు. విద్యార్థులు, ప్యాకల్టీ పరస్పర మార్పడి జరగాలని అభిప్రాయపడ్డారు. అలాగే, కరీంనగర్‌కు చెందిన స్ఫూర్తి ఫౌండేషన్‌, పీజేటీఎస్‌ఏయూ మధ్య కూడా మరో అవగాహన ఒప్పందం కుదిరింది. పీజేటీఎస్‌ఏయూ రిజిస్ట్రార్ ఎస్‌.సుధీర్‌కుమార్‌, స్ఫూర్తి ఫౌండేషన్ ఛైర్మన్‌ కె.జగన్మోహన్‌రావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కీలక వ్యవసాయ పంటల సాగు, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపుపై కలిసి పనిచేస్తామని ఇరు సంస్థలు ప్రతినిధులు పేర్కొన్నారు. VIS...........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.