ఆర్టీసీ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించడంపై ఆర్థిక మంత్రి హరీశ్ స్పందించారు. ఆర్టీసీకి వచ్చే ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించడం, సమ్మె కాలానికి వేతనాలు ఇవ్వడం, తక్షణ సాయంగా రూ.100 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారని.. ఆయా మొత్తాన్ని సేకరించాల్సిన బాధ్యత తన మంత్రిత్వ శాఖపైనే ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమైనప్పుడు తన గుండె వేగంగా కొట్టుకుందన్నారు. నీటిపారుదల మంత్రిగా గతంలో ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేయడమే లక్ష్యంగా ఉండేదని.. ఇప్పుడు ఆర్థికమంత్రిగా తన పాత్ర విభిన్నమైనదని హరీశ్ పేర్కొన్నారు.
నాది నెగిటివ్ రోల్..
ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో జరిగిన చిన్న సంఘటన గురించి హరీశ్ వివరించారు. భారీ వర్షాలతో రహదారులు దెబ్బతిన్నాయని, మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించాలంటూ ఆ శాఖ మంత్రి కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. సమాధానం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్.. తనవైపు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి వైపు చూశారని పేర్కొన్నారు. రహదారులు బాగుచేసేందుకు అప్పటికే రూ.600 కోట్లు కేటాయించామని.. దానికి తోడు మరో రూ. 550 కోట్లు ఇవ్వాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుదరదని తాను చెప్పానని.. హరీశ్ తెలిపారు. నిధులు కేటాయించాలని మనసులో ఉన్న.. ఆర్థిక మంత్రిగా ఆ పని చేయలేకపోతున్నానని చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ల సదస్సులో సరదాగా తన అనుభవాలను వివరించారు.
ఇవీచూడండి: ఆర్టీసీపై ప్రభుత్వ కీలక నిర్ణయం... రోడ్లెక్కిన ప్రగతి రథ చక్రాలు