రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపల్ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. మున్సిపాలిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి కౌన్సిల్ సమావేశంలో చర్చ నిర్వహించారు. 14, 15వ ఆర్థికసంఘం, ఎల్ఆర్ఎస్, పట్టణ ప్రగతి, జనరల్ ఫండ్ మొత్తం కలుపుకొని దాదాపు రూ.4 కోట్ల 15లక్షల నిధులు రానున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిధులతో మున్సిపాలిటీలో చేపట్టాల్సిన పనులపై ఏజెండాను రూపొందించి ఆమోదం తెలిపారు. ఇందులో 10 శాతం హరితహారం కోసం కేటాయించినట్లు వెల్లడించారు. గతంలో చేపట్టాల్సిన పనులను జనరల్ ఫండ్ రాగానే పూర్తి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ తెలిపారు.