ETV Bharat / state

'ధరణి' సర్వేకు సహకరించాలి: మున్సిపల్​ కమిషనర్​ - Rangareddy District Latest News

రంగారెడ్డి జిల్లాలో ధరణి పోర్టల్​లో నమోదు చేస్తున్న ఆస్తుల వివరాల ప్రక్రియపై.. మున్సిపల్​ కమిషనర్​ ప్రవీణ్​కుమార్... ఆకస్మిక తనిఖీలు చేశారు. ధరణి సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.

'ధరణి' సర్వేకు సహకరించాలి: మున్సిపల్​ కమిషనర్​

author img

By

Published : Oct 7, 2020, 8:44 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి పురపాలకలో అన్ని వార్డుల్లో ధరణి పోర్టల్​లో నమోదు చేస్తున్న ఆస్తుల వివరాల ప్రక్రియపై.. మున్సిపల్​ కమిషనర్​ ప్రవీణ్​కుమార్ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ధరణిలో వివరాలు నమోదు చేసుకుంటున్న వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బందికి ఎలాంటి పత్రాలు ఇవ్వద్దని.. ఒక ఫోటో, ఆధార్​ నంబర్​ ఇచ్చి మిగతా వివరాలు ఇస్తే చాలు అని చెప్పారు. సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యం చేసినా.. పత్రాలు అడిగినా.. ఏమైనా అపోహలు ఉన్నా.. నేరుగా తనని సంప్రదించాలని ప్రజలకు మున్సిపల్​ కమిషనర్​ ప్రవీణ్​కుమార్​ కోరారు.

కొన్ని ముస్లిం మైనారిటీ వార్డుల్లో ఆస్తుల వివరాలు సేకరించడానికి వచ్చిన సిబ్బందికి సహకారం కరువైంది. ఇప్పటివరకు జల్పల్లి మున్సిపాలిటీలో 5600 ఆస్తుల వివరాలు నమోదయ్యాయి. అపోహలు వద్దు.. ఆస్తుల నమోదు కొరకే ధరణి పోర్టల్ అని కమిషనర్​ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.