విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు ఆమె భర్త సుభాష్ రెడ్డి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. హత్యలో సురేష్ కాకుండా ఇతరుల ప్రమేయం ఉండొచ్చని పోలీసులకు సుభాష్‌రెడ్డి తెలిపారు. కేసు దర్యాప్తు అధికారి, వనస్థలిపురం ఏసీపీ జయరాం.. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఘటన జరిగిన తీరును మరోసారి పరిశీలించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నిచారు. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సురేష్ భార్య, తల్లిదండ్రులు, పెద్దనాన్నను పోలీసులు ప్రశ్నించారు. హత్యలో ఇంకెవరి ప్రమేయం ఏమైనా ఉందా.. అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రైవర్ గురునాథం చనిపోవడంతో నిందితుడు సురేష్ పైన పోలీసులు మరో కేస్ నమోదు చేశారు. వివాదాస్పద భూమికి సంబంధించిన దస్త్రాలను పోలీసులు ఇదివరకే స్వాధీనం చేసుకొని వాటిని పరిశీలిస్తున్నారు.
ఇదీ చూడండి: విజయారెడ్డి హత్యకు ఎవరో ప్రేరేపించారు: సురేశ్ భార్య