ఆర్టీసీ బస్సులు ప్రారంభం కావడం వల్ల ఇంటర్ మూల్యాంకనానికి వెళ్లే అధ్యాపకుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులను నిలిపివేశారు. ఆర్టీసీ బస్సులు కేవలం నగర శివార్లలోకే వెళ్తుండడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుందని... ఆ ఛార్జీలు తట్టుకోలేమని అధ్యాపకులు వాపోతున్నారు.
తాండూరు, వికారాబాద్, పరిగి నుంచి వచ్చే అధ్యాపకులు దాదాపుగా 300 మంది గంటల తరబడి చేవెళ్ల బస్టాండ్‌లో వేచి ఉండి నిరసన వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డ్ అధికారులు స్పందించి తమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 42 కరోనా పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి