- రంగారెడ్డి జిల్లాలో మొత్తం 3822 పరిశ్రమలనూ ఆన్‌లైన్ చేశారు.
- మేడ్చల్ జిల్లాలో హెచ్‌టీ విభాగంలో 1700 పరిశ్రమలు ఉన్నట్లు నమోదు చేశారు.
- ఇక ఎల్‌టీ విభాగంలో కనెక్షన్లు 12,407 ఉండగా అందులో 6,920 పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు 2814 పరిశ్రమలు రికార్డు చేశారు.
పరిశ్రమలను రెండు విభాగాలుగా విభజించి వివరాలు సేకరిస్తున్నారు. ఎల్‌టీ, హెచ్‌టీ విద్యుత్తు కనెక్షన్ల ఆధారంగా భారీ, చిన్న పరిశ్రమలను నమోదు చేస్తున్నారు.
శివార్లలోని చాలావరకు పరిశ్రమలు తమ ఉత్పత్తులకు అవసరమైన ముడిసరకును ఇతర రాష్ట్రాలు లేదా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. ఆ సరకును అందించే పరిశ్రమలు ఇక్కడే ఉన్నా, సరైన సమాచారం అందుబాటులో లేక వినియోగించలేకపోతున్నాయి. ఈ అంతరాన్ని తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రతి జిల్లాలో ఉన్న పరిశ్రమల వివరాలను పరిశ్రమల శాఖ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేసి త్వరలోనే అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. పరిశ్రమ ఏర్పాటు మొదలుకుని సామర్థ్యం, ఉత్పత్తి, విద్యుత్తు కనెక్షన్ వివరాలు.. ఇలా సమస్త సమాచారం సేకరించి ప్రతి యూనిట్ వారీగా వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్లు రాజేశ్వర్‌రెడ్డి, రవీందర్ వివరించారు.
ఇదీ చదవండిః కదులుతున్న కంటైనర్లే టార్గెట్.. రెక్కీ చేస్తే పనైపోయినట్టే!