Ibrahimpatnam ACP Suspended : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రియల్టర్ల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ బాలకృష్ణారెడ్డి సస్పెండ్ అయ్యాడు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కర్నెంగూడ వద్ద గత నెల 1వ తేదీన జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు స్థిరాస్తి వ్యాపారులు మృతి చెందారు. మట్టారెడ్డి అనే వ్యక్తి తన అనుచరులతో హత్య చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మట్టారెడ్డితో పాటు పోలీసులు... ఐదుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Realtors Murder Case Update : ఈ కేసులో బాధ్యులను చేస్తూ ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఎస్సై విజయ్, కానిస్టేబుల్ బాలకృష్ణలను సీపీ మహేశ్ భగవత్ బదిలీ చేశారు. ఏసీపీ బాలకృష్ణారెడ్డి నిందితుల నుంచి డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలతో అధికారులు అతనిపై అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా ఏసీపీ బాలకృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
సంబంధిత కథనాలు :