ETV Bharat / state

CORONA VACCINE: ఏ రోజు ఏ వ్యాక్సిన్‌ వస్తుందో తెలియక అవస్థ - telangana news

హైదరాబాద్​లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రజలందరూ టీకాలు తీసుకునేందుకు వచ్చి క్యూలైన్లలో నిల్చున్నప్పటికీ... అధికారులు ఏ రోజు ఏ టీకా వేస్తున్నారు, ఏ డోసు వేస్తున్నారు వంటి విషయాలను ఉదయం 10 గంటల వరకూ చెప్పలేకపోతున్నారు.

hyderabad-people-facing-problems-with-get-corona-vaccine
ఏ రోజు ఏ వ్యాక్సిన్‌ వస్తుందో తెలియక అవస్థ
author img

By

Published : Jul 28, 2021, 9:41 AM IST

మూడో దశ కరోనాకు అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వ్యాక్సిన్‌ ప్రక్రియ వేగంగా సాగాలని పదే పదే నిపుణులు చెబుతున్నారు. గ్రేటర్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో రెండు టీకాలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ ఉచితంగా అందిస్తున్నారు. ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ప్రజలు సుముఖంగా ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏ రోజు ఏ టీకా అందుబాటులో ఉంటుందో.. ఏ డోసు ఇస్తారో కూడా ఉదయం 10 గంటల వరకు కేంద్రాల్లో సిబ్బంది చెప్పలేకపోతున్నారు.

అంబర్‌పేట మున్సిపల్‌ మైదానంలో బారులు తీరిన జనం

ఒక్కో కేంద్రంలో మొదటి డోసు కోసం పెద్ద సంఖ్యలో ఉంటే.. అక్కడ రెండో డోసు ఇస్తున్నారు. మరోచోట రెండో డోసు కోసం నిరీక్షిస్తుంటే మొదటి డోసు అందుబాటులో ఉంటోంది. కొన్ని కేంద్రాల్లో తూతూ మంత్రంగా 20-30 మందికి ఇచ్చి డోసులు లేవని 12 గంటలకే మూసేస్తున్నారు. వృద్ధులు, మహిళలు కేంద్రాల చుట్టూ నిత్యం తిరుగుతున్నారు. తీరా ఇక్కడ టీకా లేకపోవడంతో ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్న టీకా కార్యక్రమంపై ‘ఈనాడు’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. వివిధ కేంద్రాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తేటతెల్లమయ్యాయి.

మల్లేపల్లి భారత్‌ గ్రౌండ్స్‌లో తెరచుకోని కేంద్రం
  • నాంపల్లి పరిధిలోని మల్లేపల్లి భారత్‌ గ్రౌండ్స్‌, గుడిమల్కాపూర్‌ నవోదయకాలనీ సామాజిక భవనం, సైనిక్‌పురి సాయిపురి కాలనీలో చందానగర్‌లోని అంబేడ్కర్‌ మున్సిపల్‌ కల్యాణమండపం, కేంద్రాలు గత కొన్ని రోజులుగా తెరచుకోవడం లేదు. శాంతినగర్‌లోని వెట్‌ గార్డెన్‌లో మంగళవారం రెండో డోసు మాత్రమే వేశారు. దీంతో మొదటి డోసు కోసం వచ్చిన వారంతా వెనుదిరగక తప్పలేదు.
  • కూకట్‌పల్లిలో గత నెలలో రోజుకు 20వేల డోసులు వచ్చేవి. ఈ నెల దాదాపుగా రోజుకు 3నుంచి 4వేల లోపు డోసులు మాత్రమే వస్తున్నాయి. దీంతో ఒక్కో కేంద్రంలో 50నుంచి 100మందికి మాత్రమే వేస్తున్నారు.
  • పంజాగుట్టలో మొదటి డోస్‌ వేసుకున్న వారు నిర్ణీత కాలపరిమితి ముగిసినందున వ్యాక్సిన్‌ వేయాలని ఆరోగ్య కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.
రజినీబాయి

ఈమె పేరు రజినీబాయి. సీతారాంబాగ్‌ బైటక్‌ నివాసి. కొవిడ్‌ మొదటి డోసు టీకా కోసం నాలుగు రోజులుగా తిరుగుతున్నారు. శాంతినగర్‌, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, గుడిమల్కాపూర్‌ నవోదయకాలనీ, భారత్‌గ్రౌండ్స్‌ ప్రాంతాల్లోని పంపిణీ కేంద్రాలు మూసేసి ఉన్నాయి. సమాచారం ఇచ్చేందుకు ఎవరూ అందుబాటులో ఉండడం లేదు. ఆటోలో వచ్చి వెళ్లేందుకు రోజు రూ.120 అవుతోందని ఆవేదన చెందుతోంది.

లక్ష్మమ్మ, మహమూదా

మెహిదీపట్నం మారుతీనగర్‌కు చెందిన వీరు లక్ష్మమ్మ, మహమూదా. వంట పనిచేసుకుని కుటుంబాలను పోషించుకుంటారు. టీకా తీసుకోవాలని వారు పనిచేసే చోట చెప్పడంతో 5 రోజులుగా తిరగని కేంద్రం లేదు. కార్వాన్‌, నవోదయకాలనీ, మల్లేపల్లి, శాంతినగర్‌, నాంపల్లిలోని కేంద్రాల చుట్టూ చక్కర్లు కొట్టారు. ఆటోలో వచ్చి పోయేందుకు రోజు రూ.200 చొప్పున ఇప్పటి వరకు రూ.వెయ్యి ఖర్చు అయ్యిందని అయినా టీకా దొరకలేదని చెబుతున్నారు.

ఇదీ చూడండి: Medical Colleges: రేపట్నుంచి వైద్యకళాశాలలు పునఃప్రారంభం.. పాఠాలు ఆన్‌లైన్‌లోనే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.